• waytochurch.com logo
Song # 3685

laelemmu soadharee soadharudaa rakshkudaesuni saevimpలేలెమ్ము సోదరీ సోదరుడా రక్షకుడేసుని సేవింప



Reference: నిద్రించుచున్న నీవు మేల్కొని లెమ్ము. క్రీస్తు నీ మీద ప్రకాశించును. ఎఫెసీయులకు Ephesians 5:14

పల్లవి: లేలెమ్ము సోదరీ సోదరుడా - రక్షకుడేసుని సేవింప

1. సత్యముతో ఆత్మతో దేవుని - సన్నిధి జేరి ఆరాధింప
ఆశ్చర్యకరుడు ఆలోచన - కర్త బలవంతుడు ప్రభుయేసు

2. రాజాధిరాజు మన ప్రభుయేసు - రాజ్యము నీయ మనకై వచ్చున్
రాజైన యేసు విజయము కల్గి - విజయుండు యేసుని చాటెదము

3. షద్రకు మేషాక బెద్నాగో - పౌరుషముతోడ ప్రభుశ్రమ నోర్చె
కరువైనను మీకు శ్రమలైన - కరుణించుచు ప్రభు మీతో నడుచున్

4. స్తెఫెనాది అపొస్తలులంత - అపవిత్రమైన ప్రజలమధ్య
కృపాళుదైన యేసుని చాటె - కృపనొందుచు ప్రభుని చాటండి

5. అర్పించుడి మీదు హృదయములన్ - నెరవేర్చను దేవుని చిత్తమును
కర్తను సేవింపగను లెండి - వీరులుగా దావీదు వలెను

6. యౌవనేచ్ఛలను విసర్జించి - యౌవన రక్తముతో మిము గొన్న
పావనుడగు యేసు ప్రభువునకై - చావను వెనుదీయక రారండి

7. జీవించువాడనే కానంచు - జీవించుట ప్రభు కొరకే యంచు
గావించుము ప్రభు పనులిలలోన - జీవించు ప్రభు కొరకే యిలలో



Reference: nidhriMchuchunna neevu maelkoni lemmu. kreesthu nee meedha prakaashiMchunu. epheseeyulaku Ephesians 5:14

Chorus: laelemmu soadharee soadharudaa - rakShkudaesuni saeviMp

1. sathyamuthoa aathmathoa dhaevuni - sanniDhi jaeri aaraaDhiMp
aashcharyakarudu aaloachana - kartha balavMthudu prabhuyaesu

2. raajaaDhiraaju mana prabhuyaesu - raajyamu neeya manakai vachchun
raajaina yaesu vijayamu kalgi - vijayuMdu yaesuni chaatedhamu

3. Shdhraku maeShaaka bedhnaagoa - pauruShmuthoada prabhushrama noarche
karuvainanu meeku shramalaina - karuNiMchuchu prabhu meethoa naduchun

4. sthephenaadhi aposthalulMtha - apavithramaina prajalamaDhy
krupaaLudhaina yaesuni chaate - krupanoMdhuchu prabhuni chaatMdi

5. arpiMchudi meedhu hrudhayamulan - neravaerchanu dhaevuni chiththamunu
karthanu saeviMpaganu leMdi - veerulugaa dhaaveedhu valenu

6. yauvanaechChalanu visarjiMchi - yauvana rakthamuthoa mimu gonn
paavanudagu yaesu prabhuvunakai - chaavanu venudheeyaka raarMdi

7. jeeviMchuvaadanae kaanMchu - jeeviMchuta prabhu korakae yMchu
gaaviMchumu prabhu panulilaloana - jeeviMchu prabhu korakae yilaloa


Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com