• waytochurch.com logo
Song # 3496

paapulakoraku prabhuyaesu siluvaloa baliyaayenuపాపులకొరకు ప్రభుయేసు సిలువలో బలియాయెను



Reference: దేవుని కృపామహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తమువలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగియున్నది. ఎఫెసీ Ephesians 1:7

పల్లవి: పాపులకొరకు ప్రభుయేసు - సిలువలో బలియాయెను
పాపికి రక్షణనిచ్చెను - పావన రక్తము కార్చి

1. దుష్ట జగమున ఏల తిరిగెదవు ప్రియుడా?
మునిగెదవేల ఎన్నడు పాపములో?
దాచిన నీవు నీ పాపమును ప్రియుడా
నిత్య జీవమును ఏలాగు పొందెదవు?

2. పాపభారము క్రింద పడియున్న ప్రియుడా
ప్రభునికడకు రమ్ము విశ్రాంతికై
నెమ్మది నిచ్చును దీనులకు ప్రియుడా
యిదియే యేసుని వాగ్దానము నమ్ము

3. నరక మార్గము విశాలము ప్రియుడా
జీవమునకు పోవుమార్గము ఇరుకు
ప్రభుయేసువే నిజమార్గము ప్రియుడా
పరము చేరుదువు యేసుని ద్వారానే

4. ఇహలోక నీ బ్రతుకు నీడయే ప్రియుడా
పాప దుహ్ఖముతో నిండియున్నది
దీనుడైన నీవు శుద్ధిని కోరుము ప్రియుడా
దొరుకును రక్షణ ఈ క్షణమే



Reference: dhaevuni krupaamahadhaishvaryamunu batti aa priyuni yMdhu aayana rakthamuvalana manaku vimoachanamu, anagaa mana aparaaDhamulaku kShmaapaNa manaku kaligiyunnadhi. ephesee Ephesians 1:7

Chorus: paapulakoraku prabhuyaesu - siluvaloa baliyaayenu
paapiki rakShNanichchenu - paavana rakthamu kaarchi

1. dhuShta jagamuna aela thirigedhavu priyudaa?
munigedhavaela ennadu paapamuloa?
dhaachina neevu nee paapamunu priyudaa
nithya jeevamunu aelaagu poMdhedhavu?

2. paapabhaaramu kriMdha padiyunna priyudaa
prabhunikadaku rammu vishraaMthikai
nemmadhi nichchunu dheenulaku priyudaa
yidhiyae yaesuni vaagdhaanamu nammu

3. naraka maargamu vishaalamu priyudaa
jeevamunaku poavumaargamu iruku
prabhuyaesuvae nijamaargamu priyudaa
paramu chaerudhuvu yaesuni dhvaaraanae

4. ihaloaka nee brathuku needayae priyudaa
paapa dhuhkhamuthoa niMdiyunnadhi
dheenudaina neevu shudhDhini koarumu priyudaa
dhorukunu rakShNa ee kShNamae


Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com