• waytochurch.com logo
Song # 3214

yehoavaa nee yokka maata choppunయెహోవా నీ యొక్క మాట చొప్పున



Reference: నేను నీ ఆజ్ఞలయందు నమ్మిక యుంచియున్నాను. మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పుము. శ్రమకలుగక మునుపు నేను త్రోవ విడిచితిని. ఇప్పుడు నీ వాక్యము ననుసరించి నడుచుకొనుచున్నాను. కీర్తన Psalm 119:65-72

పల్లవి: యెహోవా నీ యొక్క మాట చొప్పున
నీ దాసునికి మేలు చేసియున్నావు

1. మంచి వివేచన మంచి జ్ఞానమునకు - కర్త నీవే నాకు బోధ చేయుము
నీ యాజ్ఞలందు నమ్మిక నుంచితిని

2. నాకు శ్రమ కలుగక మునుపు - నా దేవా నేను త్రోవ వీడితిని
నేడు నీ మాట నెరవేర్చు చున్నాను

3. దేవా నీవు దయగలవాడవు - దేవా నీవు మేలు చేయుచున్నావు
నీ కట్టడల నాకు బోధించుము

4. గర్విష్ఠులు నాకు విరోధముగా - కల్పించుదురెన్నో అబద్ధములు
నీ యుపదేశము లనుసరింతును

5. వారి హృదయములు క్రొవ్వువలె - చాల మందముగానై యున్నవి
ఆజ్ఞలలో ఆనందించుచున్నాను

6. దేవా నేను నీ కట్టడలను - నేర్చుకొనునట్లు శ్రమల నొంది
యుండుట నాకు యెంతో మేలాయెను

7. వేలాది వెండి నాణెముల కంటె - వేలాది బంగారు నాణెముల కంటె
నీ విచ్చిన ఆజ్ఞలు నాకు మేలు



Reference: naenu nee aajnYlayMdhu nammika yuMchiyunnaanu. mMchi vivaechana mMchi jnYaanamu naaku naerpumu. shramakalugaka munupu naenu throava vidichithini. ippudu nee vaakyamu nanusariMchi naduchukonuchunnaanu. keerthana Psalm 119:65-72

Chorus: yehoavaa nee yokka maata choppun
nee dhaasuniki maelu chaesiyunnaavu

1. mMchi vivaechana mMchi jnYaanamunaku - kartha neevae naaku boaDha chaeyumu
nee yaajnYlMdhu nammika nuMchithini

2. naaku shrama kalugaka munupu - naa dhaevaa naenu throava veedithini
naedu nee maata neravaerchu chunnaanu

3. dhaevaa neevu dhayagalavaadavu - dhaevaa neevu maelu chaeyuchunnaavu
nee kattadala naaku boaDhiMchumu

4. garviShTulu naaku viroaDhamugaa - kalpiMchudhurennoa abadhDhamulu
nee yupadhaeshamu lanusariMthunu

5. vaari hrudhayamulu krovvuvale - chaala mMdhamugaanai yunnavi
aajnYlaloa aanMdhiMchuchunnaanu

6. dhaevaa naenu nee kattadalanu - naerchukonunatlu shramala noMdhi
yuMduta naaku yeMthoa maelaayenu

7. vaelaadhi veMdi naaNemula kMte - vaelaadhi bMgaaru naaNemula kMte
nee vichchina aajnYlu naaku maelu


Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com