unnavaadavu anuvaadavu neevu ఉన్నవాడవు అనువాడవు నీవు
ఉన్నవాడవు అనువాడవు నీవు
నిన్న నేడు నిరతము మారని మా యేసయ్యా
అల్ఫయు ఓమేగాయు నీవే కదా
ఆద్యంతా రహితుడవు నీవే కదా (2)
హల్లెలూయా స్తోత్రార్హుడా
యుగయుగములకు స్తుతిపాత్రుడా (2)
పలుకబడిన వాక్కుతో
ప్రపంచములు నిర్మించితివి
మంటితో మము చేసి
జీవాత్మను ఊదితివి (2)
మమ్మునెంతో ప్రేమించి
మహిమతో నింపితివి
పరము నుండి దిగివచ్చి
మాతో నడచితివి
పాపమంటియున్న మాకై
మా పరమ వైద్యునిగా
నీ రుధిరం నాకై కార్చి
ప్రాయశ్చిత్తం చేయగా (2)
మొదటివాడా కడపటివాడా
జీవింపచేసితివే
నీదు ఆత్మతో నింపితివే
మమ్ము సరిచేసితివే
ప్రతివాని మోకాలు
వంగును నీ నామమున
ప్రతివాని నాలుక
చాటును నీ మహిమను (2)
తరతరములకు మమ్మేలువాడా
భూపతుల రాజువే
మేఘారూడుడై దిగివచ్చి
మహినేలు మహారాజువే