bethlehemu puramunandhuna బెత్లెహేము పురమునందున
బెత్లెహేము పురమునందున
కన్య మరియ గర్భమందున
బాలయేసుడు పుట్టేనమ్మా
గొల్లలు జ్ఞానులు ఆరాధించిరి
మనము కూడా ఆరాధింతుము
యేసుని హల్లెలుయ
శాపాన్ని తొలగించడానికి
పాపాన్ని కడిగేయడానికి
పశువుల పాకలో పుట్టాడు
మానవులను రక్షించుటకు
ఆరాధించిరి ఆనాడు యేసుని
మనము కూడా ఆరాధింతుము
కష్టాలను తీర్చడానికి
కన్నీటిని తుడవడానికి
కల్వరిలో ప్రాణమిచ్చుటకై
ప్రభుయేసు జన్మించెన్
ఆరాధించిరి ఆనాడు యేసుని
మనము కూడా ఆరాధింతుము