• waytochurch.com logo
Song # 3419

etuvmti yaagamu jaesithivi yaesu neevale naenumda naa korakaiఎటువంటి యాగము జేసితివి యేసు నీవలె నేనుండ నా కొరకై



Reference: సిలువ మరణము పొందునంతగా తన్నుతాను తగ్గించుకొనెను. ఫిలిప్పీ Philippians 2:8

పల్లవి: ఎటువంటి యాగము జేసితివి యేసు
నీవలె నేనుండ నా కొరకై

1. పరమ తండ్రి సన్నిధిన్ బరలోక ప్రణుతింపు విడచితివి
పశువుల తొట్టిలో పరుండియు
పరమ ప్రేమన్ జూపెను

2. జన్మదినము నుండియు జనులకై ప్రాణంబు నిచ్చువరకు
మాకై సిలువ బాధ నొందితివి
మమ్మును విమోచించన్

3. తల వాల్చుటకైనను స్థలమిలలో లేనే లేకుండే నీకు
నీయడుగు జాడలలో నేనుండన్
నాముందు వెళ్ళితివి

4. తమ తల్లి దండ్రులను తమ స్వంతవాటిని విడచిపెట్టి
నీ సిలువ మోయు వారెల్లరును
నీ మహిమ జూచెదరు

5. నీ శ్రమలు బాధలేగా నీ మహిమలోనికి దెచ్చెనిన్ను
నీకై నా జీవమెల్ల నియ్యను
నీ శ్రమలే నే కోరెదన్

6. నా యానంద మీవేగా నా ప్రభువా నాకిలలో వేరే వలదు
నీ వెంట వెళ్ళను నే వెరువను
నీ ప్రేమ నాలో నుండ



Reference: siluva maraNamu poMdhunMthagaa thannuthaanu thaggiMchukonenu. philippee Philippians 2:8

Chorus: etuvMti yaagamu jaesithivi yaesu
neevale naenuMda naa korakai

1. parama thMdri sanniDhin baraloaka praNuthiMpu vidachithivi
pashuvula thottiloa paruMdiyu
parama praeman joopenu

2. janmadhinamu nuMdiyu janulakai praaNMbu nichchuvaraku
maakai siluva baaDha noMdhithivi
mammunu vimoachiMchan

3. thala vaalchutakainanu sThalamilaloa laenae laekuMdae neeku
neeyadugu jaadalaloa naenuMdan
naamuMdhu veLLithivi

4. thama thalli dhMdrulanu thama svMthavaatini vidachipetti
nee siluva moayu vaarellarunu
nee mahima joochedharu

5. nee shramalu baaDhalaegaa nee mahimaloaniki dhechcheninnu
neekai naa jeevamella niyyanu
nee shramalae nae koaredhan

6. naa yaanMdha meevaegaa naa prabhuvaa naakilaloa vaerae valadhu
nee veMta veLLanu nae veruvanu
nee praema naaloa nuMd


Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com