• waytochurch.com logo
Song # 3415

siluvaloa baliyaina dhaevuni gorrepillసిలువలో బలియైన దేవుని గొర్రెపిల్ల



Reference: మన యతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచ బడెను. మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతనిమీద పడెను. యెషయా Isaiah 53:5

పల్లవి: సిలువలో బలియైన దేవుని గొర్రెపిల్ల
విలువైన నీ ప్రేమన్ వివరింతు శ్రీయేసు

1. ఆనాటి యూదులే నిన్ను జంపిరనుకొంటి
కాదు కాదయ్యయ్యో - నా పాప ఋణమునకే

2. నా యతిక్రమములకై - నలుగగొట్టబడి
నా దోషముల నీవు - ప్రియముగను మోసితివా

3. మృదువైన నీ నుదురు - ముండ్ల పోట్లచేత
సురూపము లేక - సోలిపోతివా ప్రియుడా

4. నా రోగముల నీపై నమ్రతతో భరియించి
తృణీకరింపబడి - ప్రాణమర్పించితివి

5. వ్యసనాక్రాంతుడవుగా - వ్యాధి ననుభవించి
మౌనము ధరించి - మరణమైతివా ప్రభువా

6. నా పాప దోషముచే - నే చచ్చి యుండగనే
మరణమై నాకొరకు - మరి తిరిగి లేచితివా

7. పరమున కెత్తబడిన - ప్రియ యేసురాకడకై
పదిలముగ కనిపెట్టి - పాడెదను హల్లెలూయ



Reference: mana yathikramakriyalanubatti athadu gaayaparacha badenu. mana dhoaShmulanubatti nalugagottabadenu. mana samaaDhaanaarThamaina shikSh athanimeedha padenu. yeShyaa Isaiah 53:5

Chorus: siluvaloa baliyaina dhaevuni gorrepill
viluvaina nee praeman vivariMthu shreeyaesu

1. aanaati yoodhulae ninnu jMpiranukoMti
kaadhu kaadhayyayyoa - naa paapa ruNamunakae

2. naa yathikramamulakai - nalugagottabadi
naa dhoaShmula neevu - priyamuganu moasithivaa

3. mrudhuvaina nee nudhuru - muMdla poatlachaeth
suroopamu laeka - soalipoathivaa priyudaa

4. naa roagamula neepai namrathathoa bhariyiMchi
thruNeekariMpabadi - praaNamarpiMchithivi

5. vyasanaakraaMthudavugaa - vyaaDhi nanubhaviMchi
maunamu DhariMchi - maraNamaithivaa prabhuvaa

6. naa paapa dhoaShmuchae - nae chachchi yuMdaganae
maraNamai naakoraku - mari thirigi laechithivaa

7. paramuna keththabadina - priya yaesuraakadakai
padhilamuga kanipetti - paadedhanu hallelooy


Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com