thandri devaa thandri devaa తండ్రి దేవా తండ్రి దేవా
తండ్రి దేవా తండ్రి దేవా
నా సర్వం నీవయ్యా
నీవుంటే నాకు చాలు
నా ప్రియుడా నా ప్రాణమా
నిన్ ఆరాధించెదన్
నా జీవమా నా స్నేహమా
నిన్ ఆరాధించెదన్
1. నీ ప్రేమ వర్ణించుట
నావల్ల కాదయ్యా
నీ కార్యము వివరించుట
నా బ్రతుకు చాలదయ్యా
తండ్రి దేవా నా ఆనందమా
నీ వడిలో నాకు సుఖము
2. నా ప్రాణ స్నేహితుడా
నీ సన్నిధి పరిమళమే
జుంటె తేనె కన్న
నీ ప్రేమ మధురమయ్యా
తండ్రి దేవా నా ఆనందమా
నీ వడిలో నాకు సుఖము